Maharashtra: మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే మహారాష్ట్ర ఎన్నికలలో మరోసారి కమలం వికసించబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే మహా యుతికూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసిందని చెప్పాలి దీంతో విజయం కూటమిదేనని స్పష్టంగా తెలుస్తోంది.
మహారాష్ట్ర ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (145) దాటేసింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. అటు ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా మహాయుతి కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది.
మరి ఈ ఎన్నికల చివరి వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటివరకు వెలవడిన ఫలితాలు ఇలాగే కొనసాగితే మరోసారి మహారాష్ట్రలో కమలం పార్టీ అధికారం అందుకోబోతుందని చెప్పాలి. ఇక మహారాష్ట్ర ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనగా మారిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ కీలక నేతలు మహారాష్ట్ర వెళ్లి పర్యటనలు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు వారం రోజులపాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఎన్ డి ఏ కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మహారాష్ట్ర ఓటర్ల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మహాయుతి కూటమికి భారీ స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఓట్లు వేశారని తెలుస్తోంది. మరి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి ఏ పార్టీ ఎన్ని స్థానాలు ఆధిక్యంతో విజయం సాధిస్తారనేది తెలియాల్సి ఉంది.