ప్రజల కోసం సరికొత్త భీమా పథకాన్ని తెచ్చిన ఎల్ఐసి.. పూర్తి వివరాలు మీ కోసం..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమా పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తుంది. ఎల్ఐసి అందించే బీమా పథకాల ద్వారా ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసి మరొక కొత్త బీమా పథకాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల ధన్ వర్ష పేరుతో ఎల్ఐసి మరొక కొత్త బీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ప్రజలు పొదుపు చేస్తూ రక్షణ పొందవచ్చు. ఈ ధన్ వర్ష పాలసీ టర్మ్ 10, 15 ఏళ్లుగా వుంది.

ధన్ వర్ష ప్రయోజనాలు:

• ఈ ధన్ వర్ష పథకం గ్యారెంటీడ్ లంప్ సమ్ పేమెంట్‌ను అందిస్తోంది. ఒకవేళ పాలసీ దారుడు టర్మ్‌లో మరణిస్తే వారి కుటుంబానికి నగదు సాయాన్ని ఇస్తుంది. అంతే కాకుండా శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి యాక్సిడెంట్ ప్రయోజనాల కింద అందించే మొత్తాన్ని పదేళ్ల పాటు నెలవారీ వాయిదాల్లో ఇస్తుంది. అలానే ఈ పాలసీ నాన్ మెడికల్, మెడికల్ రెండు విధాలుగా మనకు అందుబాటులో ఉంటుంది.

• ఈ సరికొత్త పాలసీ కి అర్హత పొందాలంటే కనీసం 18 ఏళ్లు పూర్తి అయ్యిందని. అంతే కాకుండా రూ.1,25,000కి పాలసీ తీసుకొని డబ్బు మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.

• ఈ పాలసీపై లోన్ కూడా పొందవచ్చు. పదేళ్ల పాలసీకి 70 శాతం నుండి 60 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. అలాగే15 ఏళ్ల పాలసీకి 60 శాతం నుండి 50 శాతం వరకు లోన్ ని తీసుకోవచ్చు.