Kisan Diwas: కిసాన్ దివాస్ (రైతు దినోత్సవం).. భారతదేశంలో ప్రతి సంవత్సరం కిసాన్ దివాస్ ని జరుపుకుంటారు. ఏ రోజున విశ్రాంతి లేకుండా అహర్నిశలు పని చేస్తున్న అన్నదాతలకు దేశం కృతజ్ఞలు తెలియచేస్తుంది. కిసాన్ దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల సహకారం, రైతులు ఎదుర్కుంటుంటున్న సమస్యలు, అధునాతన సాంకేతికిత, వ్యవసాయం లో కొత్త పద్దతుల అవలంబన, పంటల విధానం, సాగులో మార్పులు తదితర అంశాలపై అర్థవైంతమైన చర్చ జరుగుతుంది.

భారతదేశానికి వెన్నుముక రైతు. అందుకే మన దేశాన్ని వ్యవసాయ దేశంగా చెబుతారు. ఇప్పటికీ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం లేదా వాటికి అనుబంధ కార్యకలాపాల పైనే ఆధారపడి ఉన్నారు. డిసెంబర్ 23న ఐదో దేశ ప్రధాని, అంతేకాకుండా అనుభవజ్ఞుడైన రైతు చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు కూడా. ఆయన రైతుల ప్రయోజనాల కోసం పాకులాడిన మనిషి. అంతేకాకుండా వ్యవసాయం కోసం ఎన్నో ముఖ్యమైన పనులు చేపట్టాడు. భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు చౌదరి చరణ్ సింగ్ అన్నదాతల కోసం, వ్యవసాయ రంగ అభ్యున్నతి కోసం ఎన్నో ముఖ్యమైన పనులు చేపట్టాడు.
అంతేకాకుండా, రైతుల నాయకులలో ఒకడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగ ప్రగతి కోసం ఆయన చేసిన కృషికి 2001 లో భారత ప్రభుత్వం డిసెంబర్ 23న రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చౌదరి చరణ్ సింగ్ మహాత్మ గాంధీచే చాలా ప్రభావితం అయ్యాడు.
భారతదేశం బానిసగా ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం చరణ్ సింగ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు. స్వాతంత్య్రానంతరం రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయడం ప్రారంభించారు. ఆయన రాజకీయాలు ముఖ్యంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై దృష్టి సారించాయి. ఆయన ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. అయితే దురదృష్టవ శాత్తు ఈ రెండు పర్యాయాలు ఆయన పదవీ కాలం ఎక్కువ కాలం కొనసాగలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో ముఖ్య పాత్ర పోషించి రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ జమీందారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఎనలేని కృషి చేశారు.
