కర్నాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్యకి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆయన ఈ ఉదయం రైల్వే ట్రాక్ పై శవమై కనిపించారు. చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ధర్మెగౌడ మృతదేహాన్ని కనుగొన్నారు.

ఘటనాస్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. ధర్మెగౌడ నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే గన్‌మెన్, పోలీసులు ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.
ఆయన ఫోన్ కూడా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆయన ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల వెదికిన తర్వాత చివరకు గుణసాగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించారు. ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
