లక్ష పెట్టి స్కూటీ కొన్నాడు… ఫ్యాన్సీ నెంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి?

సాధారణంగా కొంతమంది కొనుగోలు చేసే వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు రావాలని ఆశ పడుతుంటారు అయితే మరికొందరు ఫ్యాన్సీ నెంబర్లు అంటే ఇష్టం ఉన్నవారు ఈ నెంబర్లను దక్కించుకోవడం కోసం కాస్త డబ్బులు ఖర్చు చేసి తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్లతో వారి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన బండికి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా ఒక కోటి 11 వేల రూపాయలు ఖర్చు చేశారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది నేటిజన్స్ నీకు ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విధంగా ఫ్యాన్సీ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన ఆగనుడు ఎవరు అతని వివరాలు ఏంటి అనే విషయాన్ని వస్తే సిమ్లాకు చెందిన ఓ వాహనదారుడు.. తాను కొత్తగా కొన్న స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకునేందుకు భారీ మొత్తంలో రవాణా శాఖకు సమర్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం మరో 26 మంది పోటీ పడగా ఈయన ఏకంగా కోటి రూపాయలు చెల్లించి HP999999 దక్కించుకున్నారు.

ఇక ఈయన కోటి రూపాయలు ఖర్చు చేసి ఫ్యాన్సీ నెంబర్ ఏ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈయన లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన స్కూటీ కోసం కోటి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఎంతోమంది నేటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా స్కూటీ కోసం కోటి రూపాయల ఖర్చు చేసి ఫ్యాన్సీ నెంబర్ కైవసం చేసుకోవడంతో ఈ వ్యక్తి కాస్త ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.