పేదలకు రూపాయికే భోజనం అందించేందుకు జన్ రసోయ్ క్యాంటీన్లు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్, తూర్పు దిల్లీ ఎంపీ గంబీర్ ఈ పథకాన్ని గురువారం ప్రారంభించనున్నారు. జన్ రసోయీ పేరిట నిర్వహించే ఈ పథకాన్ని ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం తన స్వచ్ఛంద సంస్థ నిధులు, సొంత డబ్బుతో నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తన పార్లమెంటు పరిధిలోని గాంధీ నగర్‌లో గురువారం తొలి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజున అశోక్ నగర్‌లోనూ మరో క్యాంటీన్ ను తెరువనున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నదని ,నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోస్తున్నాం అని గంభీర్ చెప్పారు. ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం కలిగివుండనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
