స్నేహితురాలి న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసిన తోటి విద్యార్థులు.. ఆ విద్యార్థి ఏం చేసిందంటే?

ప్రస్తుత కాలంలో మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. కొంతమంది మహిళలు వారు బాగా నమ్మిన వారి చేతిలోనే దారుణంగా మోసపోతున్నారు. అక్కా చెల్లి కూతురు అని తేడా లేకుండా కొంతమంది కామాంధులు వావి, వరసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే మరి కొంతమంది స్నేహం ముసుగులో ఉండి మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు వీడియో తీసి డబ్బుల కోసం ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు ఈ దారుణ ఘటన భోపాల్ లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…భోపాల్‌ నగరంలోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లో సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అక్కడ చదువుకునే విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరైన ఒక విద్యార్థిని ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న బాత్రూంలో బట్టలు మార్చుకుంటూ ఉండగా ముగ్గురు తోటి విద్యార్థులు ఆమెను నగ్నంగా వీడియో తీశారు. తర్వాత ఆ వీడియోని సదరు విద్యార్థినికి చూపించి రూ. 7 వేలు రూపాయల డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు.

అయితే వారి బెదిరింపులకు భయపడని విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థులలో ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ దారుణానికి పాల్పడిన మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ప్రతిరోజు తమతో పాటు కలిసి తిరిగే తోటి విద్యార్థులే ఇలా చేయడంతో ఇనిస్టిట్యూట్ లో కలకలం సృష్టించింది.