చెన్నైలో ఘోర ప్రమాదం.. ఓనమ్ పండుగకు వచ్చి కానరాని లోకాలకు వెళ్లిన విద్యార్థులు!

దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలను అరికట్టటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్న కూడా నిర్లక్ష్యంగా వాహనాలను నడపటం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయి అనాధలుగా మిగులుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓనమ్ పండుగకు వచ్చిన విద్యార్థులు పండగ ముగించుకొని తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

వివరాలలోకి వెళితే… ఓనమ్ పండుగ సందర్భంగా గురువారం రోషన్ (18) అనే విద్యార్థి తన ముగ్గురు స్నేహితులైన ఆదర్శ్, రవి, నందనన్‌లతో కలిసి ఓనం పండుగని సెలబ్రేట్ చేసుకోవటానికి సిరువాణిలోని ఒక ప్రైవేట్ క్లబ్‌కు కారులో బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుండి నలుగురు స్నేహితులు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు తొండ ముత్తూరు సమీపంలోని తెన్నమనల్లూరు వద్దకు రాగానే వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో రోషన్ అతి వేగంగా కారు నడపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అయితే బావి లోతు ఎక్కువగా ఉండటం వల్ల నలుగురు ప్రమాదం నుండి తప్పించుకోలేక బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది సహాయంతో బావిలోంచి కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో రోషన్ గాయాలతో బయటపడగా మిగిలిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడించారు.