ఇండియాలో కరోనా వైరస్ ఎంత తీవ్రస్థాయిలో ఉందో, ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల రికార్డ్స్ చూస్తేనే అర్ధమవుతోంది. చాపకింద నీరులా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజావిసురుతోంది. ఇక తాజాగా గత 24 గంటల్లో భారత్లో 28,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 533 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని, కేంద్ర ఆరోగ్యశాఖ వెళ్ళడించింది. తాజాగా నమోదైన కేసులతో కలపి ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,06,752కు చురుకుంది. ఓవరాల్గా చూసుకుంటే, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారు 23,727 మృతి చెందగా, 5,71,459 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,11,565 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.