కళాశాల ప్రొఫెసర్‌గా విజయశాంతితో ఇంట్రడక్షన్
కాశ్మీర్‌లో మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ సింపుల్ ఎంట్రీ. కామెడీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మహేష్ కొలీగ్ గా పరిచయం
‘డాంగ్ డాంగ్’ పాట మొదలైంది. కలర్ ఫుల్ పాటలో మహేష్ మరియు తమన్నా మంచి పెర్ఫార్మన్స్. థియేటర్లో సూపర్ రెస్పాన్స్.
కిడ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు. మహేష్ అభిమానులకు సూపర్ కిక్ ఇస్స్తుంది . అనిల్ రావిపూడి మహేష్ ఎలేవేషన్ మరో లెవెల్ కి తీసుకువెళ్లారు.
మహేష్ ఒక మిషన్ మీద కర్నూలుకు బయలుదేరాడు. కామెడీ విల్లన్ తరహాలో ప్రకాష్ రాజ్ పరిచయం. రఘుబాబు ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు.
ట్రైన్ ఎపిసోడ్ మొదలవుతుంది. రష్మిక ఎంట్రీ. రావు రమేష్ సంగీత రష్మిక తల్లిదండ్రులుగా పరిచయం. రావు రామేశలో శాడిజం కి కొంచెం ఇంట్రడక్షన్.
హరితేజా మరియు ఇతర గ్యాంగ్ ఇంట్రడక్షన్. ట్రైన్ లోపల ‘జబర్దాస్త్’ హాస్యనటులు కూడా ఉన్నారు. మహేష్ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ప్రయాణిస్తున్నాడు. కామెడీ మంచి నోట్‌లో ప్రారంభమైంది, కానీ ఇప్పుడు ట్రైన్ ఏపిసోడ్ కొద్దిగా ట్రాక్‌ను కోల్పోతోంది
‘హి ఐస్ సో క్యూట్’ సాంగ్ మొదలు. రష్మిక మంచి ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మన్స్.
ట్రైన్ ఎపిసోడ్ ముగిసింది. అనుకున్నంత పండలేదు. బండ్ల గణేష్ రోల్ తేలిపోయింది.
స్టోరీ మల్లి కర్నూల్ లో ఓపెన్ అయ్యింది . విజయశాంతి కుటుంబం మిస్సింగ్.
మహేష్ విజయశాంతి కోసం వెతుకుతున్నాడు. అజయ్ ప్రకాష్ రాజ్ ముఖ్య అనుచరుడిగా ఇంట్రడక్షన్. పోసాని కర్నూల్ CI గా పరిచయం
మహేష్ మరియు అజయ్ గ్యాంగ్ మధ్య కొండా రెడ్డి బుర్జు ఫైట్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ అద్భుతంగా కోరియోగ్రఫీ చేసారు . హై వోల్టేజి ఫైట్ అభిమానులని ఖచ్చితంగా అలరిస్తుంది…
ఇంటర్వెల్
ఎప్పుడూ ఒకటే ఫార్ములానా… అంతేగా..అంతేగా..
కర్నూలు కొండారెడ్డి బురుజు.. ప్రకాశ్‌రాజ్… సీన్ అదుర్స్
సరిలేరు ఫస్టాఫ్‌లోనే అనిల్ మార్క్ కామెడీ పంచ్‌లు
ఇప్పటివరకు అబోవ్ అవేరేజ్ సినిమా. ట్రైన్ ఎపిసోడ్ ఇంకా బాగా చేసివుండొచ్చు. పాటలు పెద్ద డ్రా బ్యాక్. కథ ఇప్పుడిప్పుడే మద్దలవుతుంది. చూదాం అనిల్ రావిపూడి మనకి సెకండ్ హాఫ్ లో ఏమి సర్ప్రైజ్ ఇస్తాడో.
అజయ్ పోరాట సన్నివేశాన్ని ప్రక్ష్ రాజ్ కు వివరిస్తున్నాడు . “కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గరా అల్లురి సీతారామ రాజు ని ఛూసన్నన్న….” ఫాన్స్ కి కిక్ ఇచ్చే సన్నివేశం.
కేసు కారణంగా ప్రకాష్ రాజ్ విజయశాంతి కుటుంబాన్ని వెంటాడుతున్నారు.
ఫైట్ తర్వాత తన ఇంట్లో ప్రకాష్ రాజ్ కు మహేష్ హెచ్చరిక. రామ్ లక్ష్మణ్ సూపర్ ఫైట్ కంపోజ్ చేసారు.
మహేష్, విజయశాంతి కుటుంబంతో కలిసి ‘సూర్యిడివో చంద్రిడివో’ పాట.
సినిమా మళ్ళీ ఫన్ జోన్ లోకి వెళుతుంది . సుబ్బరాజు, వెన్నెల కిషోర్ మద్య సన్నివేశాలు. రష్మిక మరియు ఆమె కుటుంబం మళ్లీ ఎంట్రీ .
మహేష్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్. మహేష్, రావు రమేష్, క్రైమ్ బ్రాంచ్ కోటి సుబ్బరాజు మరియు వెన్నెలా కిషోర్ మధ్య మంచి కామెడీ జరుగుతోంది.
ప్రకాష్ రాజ్ చేసిన కుంభకోణాన్ని మహేష్ బయటకు తీస్తాడు. సినిమా మంచి వేగంతో ముందుకు సాగుతుంది.
ఇటీవలి కాలంలో మహేష్ నుండి వచ్చిన ఊర మాస్ సాంగ్ గా పరిగణించబడే మైండ్ బ్లాక్ పాట. మంచి విజువల్స్. చాలా కాలం తరువాత మహేష్ డాన్స్ మీద ఆసక్తి చూపించినట్టున్నాడు..
క్లైమాక్స్ వైపు పయనం. థీమ్ సాంగ్ సరిలేరు నీకెవ్వరూ.
క్లైమాక్స్ అనుకుంతా రేంజ్ లో లేదు. శుభం.
ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపిస్తుంది. అయితే పండుగ సీజన్లో కాబట్టి మాస్ కి కనెక్ట్ అయ్యే మంచి ఫైట్స్ మరియు కామెడీ సన్నివేశాలు వున్నాయి. వీటికి తోడు డీసెంట్ కథ కూడా వుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్. ఖచ్చితంగా మహేష్ ఖాతాలో ఇదొక విజయవంతమైన సినిమాగా ఉంటుంది . అయితే ఆలా వైకుంఠపురంలో మీద సరిలేరు నీకెవ్వరూ రేంజ్ ఆధారపడివుంది. అనిల్ రావిపూడి పెద్ద హీరోలతో పాస్ అయినట్టే.
Rating – 2.75/5