మ్యాడ్ లవర్ పొలికేక – ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్
విజయ్ ‘అర్జున్ రెడ్డి’ దేవరకొండ మ్యాడ్ యాంగ్రీ లవర్ గా మరో లవ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. వచ్చేసే ముందు మూవీ ట్రైలర్ తో ఒక బ్యాంగ్ ఇచ్చాడు. ‘డియర్ కామ్రేడ్’ టైటిల్ కి, టెండర్ గా మొదలై, వయొలెంట్ గా మారే భగ్న ప్రేమ కథతో మరో సారి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేశాడు ట్రైలర్ తో. ఒక వైపు కాలేజీలో రెబెల్ సీన్స్, మరోవైపు స్మాషింగ్ బ్యూటీ రశ్మికా మందన్నతో లిప్ లాక్ సీన్స్ తో హాట్ హాట్ గా వదిలాడు ట్రైలర్ ని.
విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ హీరోయిన్ రశ్మికని రిపేట్ చేస్తూ, ‘ఫైట్ ఫర్ వాట్ యూ లవ్’ అన్న ట్యాగ్ లైన్ తో కథని చూచాయగా తెలియజేసేశాడు. మ్యాడ్ లవర్ పాత్రకి మందు, సిగరెట్ సీన్లు కూడా తోడయ్యాయి. అయితే మ్యాడ్ లవర్ సినిమాలు తెలుగు, తమిళ, హిందీ మెయిన్ స్ట్రీమ్ లో అనేకం ఆల్రెడీ వచ్చాయి ‘అర్జున్ రెడ్డి’ తో కలుపుకుని. ఇప్పుడు ప్రశ్న, ‘డియర్ కామ్రేడ్’ మ్యాడ్ లవర్ కొత్తగా ఏం చెప్పబోతున్నాడన్నది. ఈ కథ మీద మూడేళ్ళు కృషి చేశామన్నాడు కొత్త దర్శకుడు భరత్ కమ్మ. ఏదైనా డిఫరెంట్ గా వుంటేనే ఇతర మ్యాడ్ లవర్ సినిమాల్ని మరిపించగలడు.
ట్రైలర్ కి జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ హైలైట్ గా కన్పిస్తోంది. విజువల్స్ కూడా కూల్ కలర్స్ తో కనువిందుగా వున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ కేకలు పెట్టడం కూడా ఎక్కువుంది.
ఈ ట్రైలర్ కి ఎనిమిదిగంటల్లో 22 లక్షల వ్యూస్ వచ్చి విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది…లక్షా 67 వేల లైక్స్, ఏడు వేల 700 డిస్ లైక్స్ వచ్చాయి. తెలుగు ఫ్యాన్సే గాకుండా, హిందీ, తమిళ, మలయాళ ఫ్యాన్స్ కూడా విశేషంగా స్పందిస్తున్నారు. హిందీ ఫ్యాన్స్ దీన్ని రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో నటించిన షాహిద్ కపూర్ ని రెడీగా వుండమంటున్నారు. ‘ఎంత గొప్ప యాక్టర్…తను సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అంటూ అమన్ మిశ్రా అనే ఫ్యాన్ ప్రశంసించాడు. విజయ్ దేవర కొండ నెమ్మదిగా నేషనల్ స్టార్ అవుతున్నాడని, విద్యాసాగర్ చారీ అనే ఇంకో ఫ్యాన్ పేర్కొన్నాడు.
ఇన్ని ఆశల్ని రెకెత్తిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ కి బంపర్ ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. బాక్సాఫీసు పెర్ఫార్మెన్స్ ఎలా వుండ బోతుందనేది జులై 26 న సినిమా లోని కంటెంట్ నిర్ణయిస్తుంది.