[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
వైరల్ అవుతున్న రివెంజర్స్ అసెంబ్లీ -‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ రివ్యూ!
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ విడుదలైంది. గతంలో విడుదలైన టీజర్ ఎంత క్రేజ్ సృష్టించిందో తెలిసిందే. టీజర్ ని బట్టి లైటర్ వీన్ కామెడీగా అన్పించినా మాంచి యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ తో సర్ప్రైజ్ చేస్తూ వైరల్ అవుతోంది…ఐదు గంటల్లో పదిన్నర లక్షల వ్యూస్ వచ్చాయి.
ఒక ఫుల్ రేంజి యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ సంతృప్తి కరంగా కన్పిస్తోంది…ఐదుగురు ఆడవాళ్ళు – వాళ్ళతో ఒకడుగా నాని చేసే నేచురల్ హంగామా ట్రైలర్ కి ఎట్రాక్షన్ గా వుంది. ఐదుగురు ఆడవాళ్ళ పగ తీర్చి పెట్టే రివెంజి రైటర్ పెన్సిల్ గా నాని యాక్షన్ సీన్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని థియేటర్లకి పరుగులు పెట్టిస్తాయి. కారు ఛేజింగులు, విలన్స్ తో ఫైట్స్, గన్ ఫైర్స్, బ్లాస్టింగ్స్… ఒకటేమిటి ఫుల్ మసాలా వుంది. ఆ అయిదుగురు ఆడవాళ్ళలో ఒకమ్మాయితో రోమాన్స్ సహా! ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కూడా పవర్ఫుల్!
‘మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే, పుస్తకాలతో నిండిపోయి వుంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం, చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’ … ‘యుద్ధానికి సిద్ధం కండి, సమరశంఖం నేనూత్తాను’ …‘నేనింకా థ్రిల్లర్ జానర్‌లోనే ఉన్నాను. సైకో థ్రిల్లర్ జానర్లోకి మారక ముందే మొదలెట్టేడ్డం!’ అనే క్రేజీ దైల్గులు అభిమానుల్ని వెర్రెత్తిస్తాయి.
ఇందులో నవ హీరో కార్తికేయ ఒక ముఖ్య పాత్రలో కన్పిస్తున్నాడు. లక్ష్మి చాలా డిఫరెంట్ గా, యాక్షన్ ఓరియెంటెడ్ గా వుందీ సారి. ఇంకా ప్రియాంకా, శరణ్యలతో బాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అనీష్ కురువిల్లా, రఘుబాబు, సత్య తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ కూర్చిన పాటలు హిట్టయ్యాయి. సాంకేతిక నిపుణులుగా కెమెరా మిరొస్లా బోజ్లేక్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ రాం కుమార్, కాస్ట్యూమ్స్ ఉత్తరా మీనన్ వ్యవహరించారు. సెప్టెంబర్ 13 న ప్రపంచ ప్రేక్షకుల ముందుకొస్తోంది.