‘గరుడ’ తో బాక్సాఫీసుకి గట్టి బ్యాంగ్ ఇచ్చిన డాక్టర్ రాజశేఖర్, మరో యాక్షన్ హీరోగా ‘కల్కి’ తో సిద్ధమవుతున్నారు. తెలంగాణ కథ తీసుకుని తెలంగాణ డిటెక్టివ్ గా కన్పించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ హార్డ్ పంచ్ నిస్తూ పవర్ఫుల్ షాట్స్ తో వుంది. రొటీన్ కి భిన్నంగా రియలిస్టిక్ టచ్ తో వుంది. 1980 లో ఒక రోజు రేడియోలో వార్త వస్తూంటే ట్రైలర్ ప్రారంభమవుతుంది.
తెలంగాణ లోని కొల్లాపూర్ ఎమ్మెల్యే సోదరుడు శేఖర్ బాబుని ఎవరో దారుణంగా హత్య చేశారని వార్త. దీంతో అల్లర్లు జరుగుతాయి. వెంటనే పోలీస్ ఆఫీసర్ కల్కి పాత్రలో రాజశేఖర్ ఎంట్రీ ఇస్తారు. చాలా యంగ్ లక్ తో, షార్ప్ గా, ఇంప్రెసివ్ గా వున్నాడు రాజశేఖర్. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేపడతాడు. ఈ నేపధ్యంలో హై ఓల్టేజి యాక్షన్ సీన్స్ మొదలవుతాయి. జర్నలిస్టుగా కన్పిస్తున్న రాహుల్ రామకృష్ణ ‘శేఖర్ బాబుని ఎవరుచంపారు? ఎవరు చంపారు?’ అని గళమెత్తుతాడు. వెంటనే ఇదే ప్రశ్న క్రౌడ్ నుంచి ప్రతిధ్వనిస్తుంది. హత్యా నేపధ్యం బాబాలతో, మంత్రాలతో వున్నట్టు కనబడుతోంది. ఒక స్వామీజీగా నాజర్ కన్పిస్తున్నాడు. క్రూరమైన విలన్ గా ఆశుతోష్ రాణా.
ఎమ్మల్యే సోదరుడు శేఖర్ బాబు హత్యగురించే ఈ సినిమా కథ అన్పిస్తుంది. కొన్ని నిజ సం ఘటనల ఆధారంగా దీన్ని మేకింగ్ చేశామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. కల్కి పాత్రని తెలంగాణా డిటెక్టివ్ గా ప్రమోట్ చేయదల్చాననీ, డిటెక్టివ్ కల్కి పాత్రతో సీక్వెల్స్ తీసే ఆలోచన వున్నట్టూ చెప్పాడు. ట్రైలర్ ఎండ్ లో ‘చంపిందెవరో చెప్పాల్సింది నేను అని’ రాజశేఖర్ డైలాగు వస్తుంది.
రాజశేఖర్ తో బాటు ఇద్దరు హీరోయిన్లు అదా శర్మ, నందితా శ్వేతా నటించారు. హేపీ మూవీస్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించారు. శివానీ, శివాత్మికలు సమర్పణ. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తొలి సినిమాగా ‘ఆ!’ తీసి విఫల ప్రయోగం చేసిన విషయం తెలిసింది. ఈసారి పక్కా మాస్ కమర్షియల్ గా తీసిన ‘కల్కి’ తో హిట్ కొడతాడో లేదో మూడు రోజుల్లో తేలుతుంది. జూన్ 28 న విడుదల.