KGF 2: కేజీఎఫ్ సినిమా ఓటిటి విడుదల ఎపుడో తెలుసా.. జీ స్టూడియోస్ ఖాతాలోకి కేజీఎఫ్..!

 

KGF 2: కన్నడ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కే జి ఎఫ్ ఎంతటి ఘన విజయంసాధించిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి. కే జి ఎఫ్ 2 సినిమా ని ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ పనులు మాత్రం ఎక్కువగా జరగడం లేదు. మార్చి 27న సినిమాకు సంబంధించిన ట్రైలర్ మాత్రమే విడుదల చేస్తున్నట్లు సమాచారం. కానీ అభిమానులు మాత్రం ప్రమోషన్ లేకపోవడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ జీ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. జీ సంస్థ కే జి ఎఫ్ 2 సినిమా ని ఓటిటి లో విడుదల చేయబోతోంది. కే జి ఎఫ్ 2 తెలుగు వర్షన్ నీ జి5 సంస్థ ఓటిటి ప్రసారం చేయనున్నట్లు సమాచారం. కే జి ఎఫ్ 2 తెలుగు వెర్షన్ తో పాటు మిగిలిన సౌత్ ఇండియా భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను జీ5 సంస్థనే సొంతం చేసుకుంది.