సౌత్ లోనే కాకుండా ఇండియాలో వచ్చిన ఫస్ట్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ యుగానికి ఒక్కడు. 7/g బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే వంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో ఒకప్పుడు తనకంటూ మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు సెల్వా రాఘవన్ తెరకెక్కించిన ఆ సినిమా 2010లో విడుదలైంది. నిజానికి ఆ సినిమా తమిళ్ లో కంటే తెలుగులోనే అసలైన బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.
తమిళ్ ఆడియెన్స్ అప్పుడు ఎక్కువగా చూడకపోయినా కూడా ఇప్పుడు మాత్రం టీవీలలో వస్తే మాత్రం వదిలిపెట్టరు. ఇక చాలా రోజుల తరువాత ఆ అడ్వెంచర్ సినిమా సీక్వెల్ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. తన సోదరుడైన ధనుష్ తోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. ఎప్పటి నుంచో అభిమానులు ఇదే ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ గా సినిమాపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా 2024లో సినిమా ప్రిన్స్ తిరిగి వస్తాడని ధనుష్ వివరణ ఇచ్చారు.
ఒక గొప్ప వర్క్!! ప్రీ ప్రొడక్షన్ కు మాకు ఒక సంవత్సరం పడుతుంది. మాస్టర్ సెల్వరాఘవన్ కు ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్. చాలా కాలం వేయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ మేము బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని కూడా ధనుష్ తెలియజేశాడు. ఇక ఫస్ట్ పార్ట్ లో కార్తీ హీరోగా నటించగా రీమా సేన్, ఆండ్రియా హీరోయిన్స్ గా కనిపించారు. మరి 2024లో రానున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.