‘జాతిరత్నాలు’ చిత్రంతో ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో డైరెక్టర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్ KV. ఆ సినిమా తర్వాత శివకార్తికేయన్‌తో చేసిన ‘ప్రిన్స్’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, అనుదీప్ క్రేజ్ తగ్గలేదు. ఎక్కడికి వెళ్లినా అభిమానుల నుంచి అతనికి మంచి ఆదరణ లభిస్తోంది.
తాజాగా అనుదీప్ తన తదుపరి చిత్రానికి విశ్వక్ సేన్‌ను హీరోగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వేరే కథలను పలు స్టార్ హీరోలకు వినిపించినప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, విశ్వక్ సేన్ మాత్రం అనుదీప్ చెప్పిన కథను ఆసక్తిగా వినడమే కాకుండా, కొన్ని మార్పులు సూచించి, ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందనుంది.
ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్‌తో చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో విశ్వక్ సేన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ ప్రాజెక్ట్‌తో కూడా విశ్వక్ తన విభిన్నమైన నటనను మరోసారి చూపించాలని భావిస్తున్నాడు. అనుదీప్ కామెడీ పంథాను, విశ్వక్ డైనమిక్ యాక్టింగ్‌ను కలిపి ఈ చిత్రం నవ్వులతో పాటు మంచి ఎమోషన్లను అందించబోతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్ అనుదీప్‌కు చాలా కీలకం. ‘జాతిరత్నాలు’ విజయంతో వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ చిత్రం సక్సెస్ కావాల్సి ఉంది. విశ్వక్ సేన్ కూడా ఇటీవల తన కెరీర్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఈ కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.