స్టార్‌గా వస్తోన్న కుర్రహీరో కవిన్‌!

కోలీవుడ్‌ యంగ్‌ హీరో కవిన్‌ అంటే ఎవరికీ తెలిసి ఉండదు కానీ.. బిగ్‌ బాస్‌ ఫేమ్‌, దాదా మూవీ హీరో కవిన్‌ అంటే అందరు గుర్తుపడతారు. దాదా సినిమాతో తమిళంలో భారీ హిట్‌ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మూవీ ఓటీటీలో లో కూడా విడుదలై రికార్డు వ్యూస్‌ సాధించింది. తాజాగా ఈ నటుడు కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశాడు. ప్యార్‌ ప్రేమ కాదల్‌ ఫేమ్‌ దర్శకుడు ఎలాన్‌ తో తన తదుపరి చిత్రం చేయబోతుండగా ఈ చిత్రానికి స్టార్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఇక ఈ చిత్రాన్ని తమిళ ప్రోడక్షన్స్‌ రైస్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ టాలీవుడ్‌ టాప్‌ ప్రోడక్షన్స్‌ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి స్పెషల్‌ ప్రోమోను ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ ప్రకటించారు. కాగా ఈ సినిమాకు కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా సంగీతం, అందించనున్నాడు.