గాసిప్పుల హీరో.! వీడు మామూలోడు కాదు.!

ఏకంగా రష్మిక మండన్నతో ఆ హీరోకి ఎఫైర్ అట.! కామెడీ కాకపోతే, ఆల్రెడీ విజయ్ దేవరకొండతో రష్మిక మండన్న డేటింగులో వుందన్న ప్రచారం జరుగుతోంది కదా.!

ఇంతకీ, ఈ కక్కుర్తి గాసిప్ సృష్టించిందెవరు.? అసలా హీరో ఎవరు.? గతంలో ఆయనగారికి కాజల్ అగర్వాల్‌తో లింకులు కట్టేశారు. ఏకంగా, కాజల్‌తో అతనికి పెళ్ళి.. అని కూడా అనేశారు.!

అంతకన్నా ముందు, తమన్నాతో.. సమంతతోనూ ఎఫైర్లు అంటగట్టేశారు ఆ హీరోకి. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చాడు ఆ హీరో. ఆరా తీస్తే, ఆ గాసిప్స్ అనీ, ఆయన కాంపౌండ్ నుంచే పుట్టుకొస్తున్నాయట.

గాసిప్స్ సృష్టిస్తే.. జనం తన గురించి మాట్లాడుకుంటారని సదరు యంగ్ హీరో అనుకుంటున్నాడట. అదండీ సంగతి.!