ఈ ప్రశంసలకు అర్హులు మీరే జక్కన్న.. వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇలా దేశంలోనే టాప్ వన్ దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఇటీవల అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లోని ఓ థియేటర్‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా స్పెషల్ షో వేశారు. ఈ షోకు రాజమౌళి కూడా హాజరై అక్కడి ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ క్రమంలో రాజమౌళి సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ఈ ప్రశంసలకు మీరే అర్హులు జక్కన్న అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూడా ఇటీవల రాజమౌళి మీద ప్రశంసలు ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఘన విజయం సాధించడానికి కారణం రాజమౌళి అంటూ హీరోలు ఇద్దరు జక్కన్న మీద ప్రశంశలు కురిపించారు.