రాజకీయాలకు మీరు కరెక్ట్ కాదు.. చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబీ.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్నం లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి రాజకీయాలకు కరెక్ట్ కాదని ఈ సందర్భంగా బాబీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంతకాలం ప్రజలకు సేవ చేశాడు. ఆ తర్వాత తనకు రాజకీయాలు కరెక్ట్ కాదని భావించిన చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమై మళ్లీ సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యాడు. అయితే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా 2019లో జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ అధికారం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గురించి దర్శకుడు బాబి మాట్లాడుతూ.. “అన్నయ్య మీకు రాజకీయాలు కరెక్ట్ కాదు, దేవుడు మీకు ఒక తమ్మున్ని ఇచ్చారు. వాటి గురించి ఆయన చూసుకుంటాడు.. ప్రజలకు మంచి చేయటం కోసం ఆయనే గట్టిగా నిలబడతాడు. మీలోని ఆవేశం మంచితనం కలిస్తే పవన్ కళ్యాణ్. మాటకి మాట, కత్తికి కత్తి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఒక సందర్భంలో చిరంజీవి గారిని రాజకీయాల్లో ఎదురు దాడి ఎందుకు చేయరు అని అడిగితే.. వాళ్ళకి అమ్మా నాన్నలు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళు కూడా బాధపడతారు కదా” అని చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాడని చిరు గురించి బాబి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.