ఎవరో మహానుభావులు లీక్ చేశారు.. రాకింగ్ స్టార్ యశ్ అసహనం

సినీ హీరో దర్శక నిర్మాతలు తమ అభిమానులను, సినీ ప్రేక్షకులను ఎంతగా సర్ ప్రైజ్ చేద్దామని భావిస్తారో.. లీకు వీరులు వాటన్నంటిని నాశనం చేస్తుంటారు. చెప్పిన టైంకు సరిగ్గా రివీల్ చేద్దామని చిత్ర యూనిట్.. వారి కంటే ముందుగా వాటిని లీక్ చేసి అవతల పారేస్తారు. అలా దేశం మొత్తం ఎదురుచూస్తోన్న కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ నేడు విడుదల కావాల్సింది. కానీ లీకు వీరులు నిన్న రాత్రే లీక్ చేసేశారు. ఇక వెంటనే అప్రమత్తమైన కేజీయఫ్ టీం దిద్దుబాటు చర్యలు చేసింది.

Yash On Kgf Chapter 2 Teaser Leaked
Yash On KGF chapter 2 Teaser Leaked

లీకైనా టీజర్‌ను ఎలాగూ ఆపలేమని తెలుసుకున్నారు. అప్పటికప్పుడు వెంటనే అఫీషియల్ టీజర్‌ను వెంటనే సోషల్ మీడియాలో రిలీజ్ చేసేశారు. ఇక లీకైన టీజర్ ఎంతగా వైరల్ అయిందో.. ఒరిజినల్ టీజర్ అంతకు మించి అనేలా రికార్డులు కొల్లగొట్టేసింది. లీక్ చేసి మీరు విజయం సాధించారని అనుకోవచ్చు.. అంతిమంగా గెలిచేది మాత్రం మా రాకీ భాయ్ అంటూ.. మంచితనం ఎప్పటికైనా గెలుస్తుందని నిర్మాతలు ప్రకటించారు.

ఇక అఫీషియల్ టీజర్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ యశ్ ఓ వీడియోను వదిలాడు. నా బర్త్ డే సందర్భంగా రేపు (జనవరి 08) విడుదల చేద్దామని అనుకున్న టీజర్‌ను ఎవరో మహానుభావులు ఇప్పుడు లీక్ చేశారు.. వారికి ఏం వచ్చిందో నాకు తెలియడం లేదు.. అందుకే అఫీషియల్ టీజర్‌ను హోంబళే పేజ్‌లో విడుదల చేస్తున్నామని యశ్ వీడియోలో తెలిపాడు. ఇలా లీక్ అవ్వడం పట్ల యశ్, ప్రశాంత్ నీల్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles