బాక్సాఫీస్ : 2 రోజుల్లో భారీ మార్క్ కొట్టేసిన “దసరా”.!

Dasara-Still-7-1024x576

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “దసరా” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి నాని కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ఆల్రెడీ నెలకొల్పగ ఈ సినిమా ఇప్పుడు రెండో రోజుకి అయితే ఓ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టినట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ సినిమా అయితే రెండో రోజుకే 53 కోట్లు మార్క్ ని చేరుకుంది. దీనితో నాని టైర్ 2 హీరోస్ లో ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు. అయితే రెండు రోజుల్లో ఈ సినిమా నైజాం లో అయితే 10 కోట్లు కి పైగా షేర్ అలాగే ఏపీలో అయితే మొత్తం రెండు రోజుల్లో 6 కోట్ల షేర్ ని దసరా రాబట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక యూఎస్ లో అయితే 1.2 మిలియన్ డాలర్స్ వసూళ్లతో అక్కడా 10 కోట్ల మేర గ్రాస్ ని రెండు రోజుల్లో దసరా రాబట్టి దుమ్ము లేపింది. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే అనుకున్న లెవెల్ కి మించి నెక్స్ట్ లెవెల్లో హిట్ అయ్యింది అని చెప్పాలి.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో సముద్రఖని కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే ఈ సినిమా సక్సెస్ తోనే అనేక ప్లాప్ లు తర్వాత ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ వారు మొదటి బాక్సాఫీస్ హిట్ ని అయితే అందుకున్నారు.