ఆరడుగుల ఆజానుబాహుడు… క్లాస్ అయినా మాస్ అయినా.. ఒక్కసారి ఫిక్స్ అయితే బొమ్మ హిట్టయ్యేలా సినిమాకోసం మానసికంగా.. శారీరకంగా.. మోకోవర్ పరంగా కష్టపడతాడు. మొదటి సినిమా ముకుంద నుంచి గత చిత్రం గద్దలకొండ గణేష్ వరసు ఈ యంగ్ హీరో సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని స్టార్ గా ఎదిగాడు మెగా హీరో వరుణ్ తేజ్. గత ఏడాది సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఎఫ్ 2 సినిమా సూపర్ డూపర్ హిట్ ని సాధించింది.
వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ తన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ని బాగా నవ్వించాడు. ముందు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయిన వరుణ్ ఎఫ్2 తో మరింతగా ఫ్యామీ ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతోంది. డిసెంబర్ 14 నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సీక్వెల్ లోనూ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ కంటిన్యూ కానుంది. వీరికి జోడీగా ముద్దుగుమ్మలు తమన్నా , మెహ్రిన్ లు సీక్వెల్ లో భాగం కానున్నారని సమాచారం. కాని ఇంకా ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయంలో పక్కా క్లారిటీ ఇవ్వలేదు మేక్ర్స్. ఇదంతా బావుది కాని వరుణ్ గురించి మాత్రం నెట్ ఇంట్లో న్యూస్ వైరల్ అవుతోంది.
వెంకటేష్ కు సమానంగా తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడన్న వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. అలాగే తన పాత్ర ప్రాధాన్యత కూడా వెంకటేష్ కు సమానంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఎఫ్ 3 కోసం వెంకటేష్ కు నిర్మాతలు దాదాపు 13 కోట్ల వరకూ ఇస్తున్నట్టు.. ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంకీ తో డీల్ చేసుకున్నట్టుగానే తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని వరుణ్ పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వరుణ్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ కి షాక్ ఇచ్చేలా ఉందంటూ మాట్లాడుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంత అన్నది మాత్రం అఫీషియల్ గా ఎవరికీ తెలిదంటున్నారు.