అఫీషియల్ : రెండు మేజర్ ఛేంజెస్ తో “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ ఫిక్స్.. 

ఈ ఏడాదిలో టాలీవుడ్ సినిమా నుంచి చాలానే ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తన హిట్ దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ స్టార్ కూడా ఒకటి. కాగా ఈ చిత్రంపై ఫస్ట్ టీజర్ తో మంచి అంచనాలు నెలకొనగా ఈ తర్వాత అయితే ఈ చిత్రం రిలీజ్ ఈ ఏడాది జనవరిలోనే రావాల్సింది కానీ మేకర్స్ వాయిదా వేశారు.

ఇక కొన్ని రోజులు నుంచి అయితే ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రిలీజ్ డేట్ లో వస్తుంది అలాగే నిర్మాత దిల్ రాజు కూడా దేవర రాకపోతే తాము ఏప్రిల్ 5న వస్తామని తెలియజేసారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మేకర్స్ అదే డేట్ ని అనౌన్స్ చేయడం విశేషం.

కాగా ఇప్పుడు అఫీషియల్ గా ఫ్యామిలీ స్టార్.. సారి “ది ఫ్యామిలీ స్టార్” చిత్రం థియేటర్స్ లో రాబోతుంది. కాగా ఫ్యామిలీ స్టార్ నుంచి ది ఫ్యామిలీ స్టార్ కి ఇప్పుడు టైటిల్ ని మార్చగా దీనితో పాటుగా మరో క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చారు. దీనితో ఈ చిత్రం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా రెండు భాషల పోస్టర్ లని రిలీజ్ చేసారు.

దీనితో ఈ చిత్రం రెండు భాషల్లో ఏక కాలంలో విడుదల అవుతుంది అని చెప్పాలి. విజయ్ కి తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. గత చిత్రం ఖుషి తమిళ్ లో కూడా సాలిడ్ వసూళ్లు అందుకుంది అందుకే ఈ చిత్రాన్ని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.