ఈ ఒక్క సాంగ్ తో శర్వానంద్ శ్రీకారం బ్లాక్ బస్టర్ అని అంతమంది ఎలా ఒప్పుకున్నారు ..?

యంగ్ హీరో శర్వానంద్ 2017 లో వచ్చిన శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు శర్వా ఆకౌంట్ లో హిట్ అన్నదే లేదు. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను సినిమాలు చేసిన శర్వానంద్ కి ఈ సినిమాలలో ఒక్కటి కూడా చెప్పుకోవడానికి సక్సస్ టాక్ తెచ్చుకోలేదు. కాగా మరోసారి శ్రీకారం అన్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైనప్పుడే ఖచ్చితంగా శతమానం భవతి సినిమా లా సూపర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫికైపోయారు.

కొత్త సినిమాకి శర్వానంద్ "శ్రీకారం" ..! - Mirchipataka.com

కాగా ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే రిలీజ్ కావాల్సి ఉండగా ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అన్న లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సూపర్ హిట్టైంది. ముఖ్యంగా మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరోసారి పెంచల్ దాస్ పాడిన సీమ జానపదం మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది.

‘వ‌చ్చానంటివో పోతానంటివో వ‌గ‌లు ప‌లుకుతావే క‌ట్ట‌మింద పోయే అల‌క‌ల చిలుక భ‌లేగుంది బాలా’ అంటూ మొదలైన ఈ పాట లో పెంచల్ దాస్ వాయిస్ కి సగం జనాలు ఫ్లాటైపోతున్నారు. అంతేకాదు సినీ ప్రముఖులంతా ఈ ఒక్క సాంగ్ వినే ఖచ్చితంగా చాలాకాలం తర్వాత శర్వానంద్ కి మంచి హిట్ దక్కబోతుందని అంటున్నారట. ఇప్పటికే పెంచల్ దాస్ పాడిన సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్న పోతుల బేరే చూడూ.. అలాగే ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత లో ‘ఊరికి ఉత్త‌రాన దారీకి ద‌క్షిణాన నీ పెనిమిటి కూలినాడ‌మ్మా …అన్న పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు శ్రీకారం నుంచి తాజాగా రిలీజైన పాట మరో లెవల్ అంటున్నారు.

Sreekaram - Bhalegundi Baalaa Lyric | Sharwanand | Kishor B | Mickey J. Meyer