సామ్ సినిమాతో మరోసారి చర్చగా మారిన దిల్ రాజు పేరు.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఈ ఏడాదికి ఆల్రెడీ పలు భారీ సినిమాలు లాక్ అయ్యిపోయాయి. ఒకో నెలలో ఒకో భారీ సినిమా అన్నట్టుగా చిత్ర నిర్మాతలు తన సినిమాల రిలీజ్ డేట్ లని లాక్ చేసి అనౌన్స్ చేస్తున్నారు. ఇక అలాగే ఈ ఏడాదిలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా నిజానికి ఈ సినిమా కిందటి ఏడాదిలోనే రిలీజ్ లోనే రావాలి కానీ పలు కారణాలు చేత వచ్చే ఏడాదికి ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో ఓ డేట్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో సినిమా నిర్మాత పేరు హాట్ టాపిక్ గా మరోసారి మారింది.

ఇప్పుడు తన తమిళ సినిమా వరిసు రిలీజ్ తో పెద్ద రచ్చే తన చుట్టూ తిరుగుతూ ఉండగా దీనితో పండుగల విషయంలో తాను చేసిన కామెంట్స్ కొన్ని ఆసక్తిగా మారాయి. కేవలం ఒకరోజు కోసం నేనెప్పుడూ సినిమాలు రిలీజ్ చేసుకోను నేను అని కొన్ని రోజులు కితమే దిల్ రాజు చెప్పారు.

కానీ ఇపుడు సమంత నటిస్తున్న ఈ చిత్రం శివరాత్రి టైం లో రిలీజ్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. దీనితో దిల్ రాజు కావాలనే పోటీ కోసం చేస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ ఓ నిర్మాతగా మంచి టైం లో రిలీజ్ చేసుకునే హక్కు తనకుంది దీనిలో కూడా తప్పులు కొందరు వెతకడం ఏంటో.. అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.