మెగాస్టార్ రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా తీసేయొచ్చా ..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. గతంలో మాదిరిగా కాకుండా వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. అది కూడా దాదాపు అందరూ యంగ్ డైరెక్టర్స్ తోనే. ఇక మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్నారప్పటి నుంచే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా ఆయన కోసం కథ లు సిద్దం చేసుకొని రెడిగా ఉన్నారు. గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

Sye Raa Narasimha Reddy Movie Review , Rating , Public Talk

సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వాస్తవంగా మెగాస్టార్ నటించబోయో సినిమాలన్ని ఆయనకోసమే చరణ్ స్థాపించిన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మించాలని అనుకున్నారు. అందుకే ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ సినిమాలను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే నిర్మించారు.

Megastar Chiranjeevi- ACHARYA motion poster released | Kakinada9.com

అయితే ‘సైరా’కి కాస్త నష్టాలు వచ్చిన కారణంగా సొంత బ్యానర్ లో సినిమాలు చేయాలనుకున్న ప్లాన్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేయాలనుకుంటున్న సినిమాలని బయట బ్యానర్లలో చేయాలని మెగాస్టార్ అనుకుంటున్నారట. ఈ క్రమంలో 2021 లో మూడు సినిమాల్లో నటించడమే కాదు అదే ఏడాది లోపు ఈ మూడు సినిమాలు రిలీజ్ చేయాలని డిసైడయినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ ఈ సినిమా పూర్తయిన తరువాత తమిళ ‘వేదాళం’ రీమేక్ లో నటించడానికి సిద్దం అవుతున్నారట.

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర సమర్పణలో అనీల్ సుంకర ఈ సినిమా ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. అలానే ‘లూసిఫర్’ రీమేక్ కూడా ఉంది. వి.వి.వినాయక్ దర్శకతంలో ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాలతో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ తో కూడా సినిమా చేయాలనుకుంటున్నారు మెగాస్టార్.

కాగా ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మొత్తం మూడు సినిమాలకి రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రెమ్యూనరేషన్ తో మెగాస్టార్ మరో భారీ పాన్ ఇండియన్ సినిమా నిర్మించవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక్కో సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.