ఆడియెన్స్ కోరికతో “RRR” పై అదిరే క్లారిటీ ఇచ్చిన జీ5.. ఇక ఫ్యాన్స్ కి జాతరే..!

ఇండియన్ సినిమా దగ్గర ఇప్పటి వరకు వచినటువంటి కొన్ని సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి బిగ్ హీరోస్ తో చేసిన మాసివ్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR). అనేక అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో రికార్డు గ్రాస్ ని అందుకుంది.

అయితే ఈ సినిమాని ఓటిటిలో దక్షిణాది భాషల్లో జీ వాళ్ళు అలాగే హిందిలో వచ్చి నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ కి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. రేపు మే 20న జీ 5 లో స్ట్రీమింగ్ కి వస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్ ఆ సంస్థ వారు ఒక అదిరే అప్డేట్ ని అందించారు. గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా జీ 5 లో డబ్బులు పెడితే చూసే విధంగా తీసుకొస్తారని తెలిసింది.

కానీ దీనితో బాగా నెగిటివిటి పెరగడంతో పైగా ఆడియెన్స్ నుంచి బాగా డిమాండ్ ఉండడంతో తాము ఫ్రీ గానే ఈ భారీ సినిమాని స్ట్రీమింగ్ కి అందిస్తున్నామని కాకపోతే జీ 5 సబ్ స్క్రైబర్ అయ్యి ఆడియెన్స్ ఉండాలని తెలిపారు. దీనితో అభిమానులకి అయితే ఒక అదిరే క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

ఇంకా ఈ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.