ఇప్పుడు మన సౌత్ ఇండియా సినిమా నుంచి అనేక సినిమాలు నాచురాలిటీ తో వస్తు సెన్సేషనల్ హిట్స్ అవుతున్నాయి. వాటికి ఉదాహరణగా చాలానే సినిమాలు ఉన్నాయి. గత ఏడాది “కాంతారా” కన్నడ నుంచి సంచలన విజయాన్ని సాధించగా లేటెస్ట్ గా అయితే నాని నుంచి “దసరా” వచ్చింది.
ఇక ఈ సినిమాతో పాటుగా తమిళ నాట జస్ట్ కొన్ని రోజులు కిందటే రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమానే “విడుతలై పార్ట్ 1”. మొదట ఈ సినిమా తెలుగు రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేయలేదు కానీ ఎప్పుడైతే ఈ సినిమా “కాంతారా” తరహాలో గట్టి టాక్ తెచ్చుకుందో ఈ సినిమా డబ్బింగ్ హక్కులు అల్లు అరవింద్ తీసేసుకోవడం రిలీజ్ పనులు కూడా స్టార్ట్ చేసేయడం జరిగింది.
అలా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది చూసాక తమిళ సినిమాకి దొరికిన ఆణిముత్యం అని దర్శకుడు వెట్రిమారన్ ని ఎందుకు అంటారో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇది వరకే “అసురణ్” తో సెన్సేషన్ నమోదు చేసిన తాను ఇపుడు ఎలాంటి బిగ్ స్టార్ లేకుండా కమెడియన్ సూరి తో అదరగొట్టే సినిమా తీసారని చెప్పాలి.
తెలుగులో వచ్చిన ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా ఉంది. ఓ సిన్సియర్ కానిస్టేబుల్ కథగా ఇది చాలా రా అండ్ రస్టిక్ గా కనిపిస్తుంది. ఓ సీరియల్ బాంబు బ్లాస్ట్ దాని వెనుక ఉన్నవారిని పట్టుకోవడం పోలీస్ వారికి ఛాలెంజ్ గా మారడం దానిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఓ రేంజ్ లో అనిపిస్తున్నాయి.
దీనితో తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అయ్యేలానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా కూడా తెలుగులో కాంతారా రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అప్పుడు కూడా కాంతారా కి మంచి బజ్ ఉండడంతో తక్కువ టైం లోనే రిలీజ్ చేశారు. మరి దీనికి మనవాళ్ళు ఎలాంటి రిజల్ట్ అందిస్తారో చూడాలి.