మేనల్లుడు భయపడుతున్నాడు కానీ.!

మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొచ్చాయ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బ్రో’ అంతంత మాత్రం హిట్ అనిపించుకుంది.

ఆకాశమే హద్దు అనేంతగా అంచనాలు పెంచేసిన ‘భోళా శంకర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సినిమా కూడా అనూహ్యంగా ఫ్లాప్ అయ్యింది.

ఈ సీజన్ మొత్తం దరి దాపుల్లో మెగా సినిమాలే.. అన్నీ హిట్ సినిమాలే.. తిరుగే లేదు.. అనుకుంటే, ఇలా ఒక్కొక్కటిగా వచ్చి ఫెయిల్యూర్స్ తమ ఖాతాలో వేసుకుని వెళ్లిపోయాయ్.

ఇక, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా ‘ఆది కేశవ’ తదుపరి లైన్‌లో వుంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

అయితే, ప్రస్తుత నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం రిస్కేమో అనుకుంటున్నారట. వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ చేస్తే బావుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట.

ప్రమోషన్లు అయితే స్టార్ట్ అయ్యాయ్ కానీ, ఎక్కడో చిన్న అనుమానం తోస్తోందట. కానీ, కథపై గట్టి నమ్మకంతో వున్నారనీ తెలుస్తోంది. అలాగే, లక్కీ గాళ్ శ్రీలీల కూడా ఈ సినిమాకి మరో కలిసొచ్చే అంశమే. చూడాలి మరి.