శ్రద్ధా కపూర్ అంత చీప్‌గా వచ్చేస్తానంటోందా.?

ఒక్క సినిమా.. ఆమె ఫేట్‌ని మార్చేసింది. ‘సాహో’ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. అప్పట్లో కనీ వినీ ఎరుగని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఇంతకీ ఏం జరిగింది.? అంటారా.? అప్పట్లో తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగం ఇచ్చినా, తెలుగులో సినిమా చేసేస్తానంటోందట శ్రద్ధా కపూర్. అంతలా ఆమె క్రేజ్ పడిపోవడానికి కారణం ‘సాహో’ సినిమానే అంటున్నారు.

తెలుగులో సినిమాలు చేసేందుకు ముంబై నుంచే టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కి వల విసురుతోందట శ్రద్ధా కపూర్. అయితే, శ్రద్ధా వల్ల పెద్దగా ఉపయోగం లేదని టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆమెని లైట్ తీసుకుంటున్నరట. మొన్న మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం శ్రద్ధా పేరు ప్రస్థావనకొచ్చింది. కానీ, అప్పుడూ లైట్ తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు కొరటాల – ఎన్టీయార్ సినిమా కోసం కూడా శ్రద్ధా కపూర్ పేరు కూడా పరిశీలించారట. కానీ, ఆ ప్రతిపాదన కూడా ముందుకు కదల్లేదట.

ఒకప్పుడు ఎంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా టాలీవుడ్ వైపు చూడని శ్రద్ధా కపూర్, ఇప్పుడు ఎంత ఇచ్చినా వచ్చేస్తానంటోంది. కానీ, ఇక్కడ ఆమెను డేర్ చేసేవాళ్లే లేరట పాపం. టాలీవుడ్‌లో శ్రద్ధా పరిస్థితి ఇలా వుంటే, సొంతిల్లు.. బాలీవుడ్‌లోనూ శ్రద్దా కెరీర్ ఏమంత బాగోలేదు.