పుష్ప సినిమా రష్మిక మందన్న కి బాలీవుడ్ అవకాశాలు వచ్చేలా చేస్తుందా ..?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో బ్యాట్రిక్ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tollywood: No competition for Rashmika Mandanna in Pushpa

ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. ఇప్పటికే వరసగా సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుది. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఎక్కువగా అడవుల్లో జరుపుకోవాల్సి ఉండగా త్వరలో కేరళ కి యూనిట్ బయలుదేరనుందని సమాచారం. అక్కడ జరిగే భారీ షెడ్యూల్ తో మేజర్ టాకీపార్ట్ కంప్లీట్ చేస్తారట.

అయితే ఈ సినిమా హీరోయిన్ రష్మిక కి చాలా ప్రత్యేకం అని చెప్పుకుంటున్నారు. 5 భాషల్లో రిలీజ్ కాబోతున్న రష్మిక మొదటి సినిమా. ఇప్పటికే ఈ సినిమా మీద ఈ కన్నడ బ్యూటీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా గనక రిలీజైన అన్ని భాషల్లో భారీ సక్సస్ ని సాధిస్తే ఖచ్చితంగా రష్మిక సౌత్ లో నంబర్ 1 ప్లేస్ కి చేరుకోవడం ఖాయమని అంటున్నారు.

కాగా ఈ సినిమా తో పాటు నాగ శౌర్య నటించబోతున్న మరొక సినిమా కూడా కమిటయింది. అలాగే తమిళం లోనూ ఎంట్రీ ఇచ్చింది. కార్తి సరసన సుల్తాన్ అన్న సినిమా చేస్తుంది. అలాగే కన్నడ లో పొగరు అన్న సినిమా కూడా చేస్తుంది. అయితే ఈ సినిమాలన్నిటికంటే కూడా రష్మిక బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి పుష్ప సినిమా బాగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉందట. చూడాలి మరి ఏం జరగనుందో.