Nani : నాచురల్ స్టార్ నాని ప్రిన్స్ మహేష్ బాబు తో పోటీ పడనున్నాడా…?

Nani : నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రాయ్ సినిమా విజయం తర్వాత చేస్తున్న సినిమా ‘అంటే సుందరానికి…’. ఈ సినిమాలో జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు చిత్ర బృందం. విడుదల తేదీ కూడా ప్రకటించడంతో చిత్రబృందం ప్రమోషనల్ పనులు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటిసారి మలయాళం బ్యూటీ నజ్రియా నటిస్తోంది. ఈ చిత్రంలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకోవడం విశేషం. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడి గా నటిస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం నాచురల్ స్టార్ నాని హీరో మహేష్ బాబుతో పోటీ పడనున్నట్టు కనిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా అయినా సర్కారు వారి పాట సినిమా తో నాచురల్ స్టార్ నాని కి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సర్కారు వారి పాట సినిమా ను మొదట మే 12 న విడుదల చేయాలి అనుకున్న ప్రస్తుతం దానిని జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమాను జూన్ 3 న విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్.

కానీ నానీ తన సినిమా అంటే సుందరానికి.. పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. మహేష్ బాబు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపించడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ పోటీ మాత్రం వట్టి ఊహగానాలు మాత్రమే. అయితే నాని అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు.

సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ఇంకా జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పటికే వచ్చిన కళావతి ఇంకా పెన్ని సాంగ్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అయితే ఈ సినిమాను మే 12 న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. కాకపోతే విడుదల తేదీని పోస్టుపోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.చూడాలి మరి విడుదల తేదీ మారిస్తే నాని సినిమా మహేష్ బాబు సినిమాతో ఎలా పోటీ పడుతుందో.