Kamal Hasan: వెంకీ, అడవి శేష్ తో కమల్ హాసన్ పోటీపడతాడా?

Kamal Hasan: కమల్ హాసన్ తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు మలయాళం ప్రేక్షకులలోనూ అంతే అభిమానం సంపాదించారు. కమల్ హసన్ ఇటీవలే బిగ్ బాస్ హోస్ట్ గా కూడా తప్పుకున్నారు. ఈయన స్థానంలో శింబు హోస్ట్ గా వచ్చారు. ఇక కమల్ హాసన్ తన సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ వేసవిలో వచ్చే భారీ సినిమాలతో పోటీపడబోతున్నారు. విజయ్ బీస్ట్, మెగా స్టార్ ఆచార్య, మహేష్ బాబు సర్కారు వారి పాట, వెంకటేష్ F3 సినిమాలు అపుడే వారి రిలీజ్ తేదిని ప్రకటించి లాక్ చేసాయి. అయితే ఇపుడు కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ ని కూడా సమ్మర్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

కమల్ హాసన్, ఫాహాద్ ఫాసీల్ తో కలిసి విక్రమ్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. లోకేష్ కనగరాజ్ ఇంతకు ముందు కార్తీ తో ఖైదీ, విజయ్ తో మాస్టర్ లాంటి హిట్ సినిమా లను తీశారు. ఇపుడు కమల్ హాసన్, ఫాహద్ సినిమా పై అంచనాలు పెరిగాయి.ఈ సినిమా కు నిర్మాత కమల్ హాసన్ కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చి 14 నా ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక మే 26న విడుదల చేయాలని కమల్ హాసన్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న F2 సీక్వల్ F3 మే 27న విడుదల తేదిని ప్రకటించారు. అలాగే అడవి శేష్ నటించిన పాన్ ఇండియా మూవీ మేజర్ కుడా ఆ రోజునే రిలీజ్ అవబోతోంది. ఇలా సమ్మర్ లో చాలా సినిమా లు క్లాష్ అవ్వబోతున్నాయి అయితే వీటిలో ఎన్ని సినిమాలు బరిలో నిలుస్తాయో వెనక్కి తగ్గి విడుదల వాయిదా వేసుకుంటాయో వేచి చూడాలి.