యానిమల్ అంత వీజీ కాదట.! రష్మిక కెరీర్ బెస్ట్.?

సందీప్ రెడ్డి వంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీస్తాడని ఎవరైనా అనగలరా.? ‘అర్జున్ రెడ్డి’ అనే ఒక్క తెలుగు సినిమానే ఆయన తెరకెక్కించింది. ఆ తర్వాత ఆయన బాలీవుడ్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’నే రీమేక్ చేశాడు.

ఈసారి ‘యానిమల్’ అనే సినిమాని రణ్‌బీర్ కపూర్, రష్మిక మండన్నలతో తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రోమోస్ అదిరిపోయాయ్.! రష్మిక లిప్ లాక్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

హీరో వైల్డ్‌గా కనిపిస్తున్నాడు.. ఇది ప్రమోషన్లు చూసేవాళ్ళకి అర్థమయిపోతుంది. మరి, రష్మిక పాత్ర సంగతేంటి.? అదైతే తెరపైనే చూడాలట. దర్శకుడు తన పాత్రతో మ్యాజిక్ చేశాడనీ, అదిప్పుడు తాను రివీల్ చేయబోననీ రష్మిక చెబుతోంది.

‘యానిమల్’ సినిమా కోసం రష్మికని ఒప్పించేందుకు సందీప్ రెడ్డి వంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కానీ, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి రష్మిక చాలా చాలా కష్టపడిందట.

నేషనల్ అవార్డ్ వచ్చేంత స్థాయి నటనా ప్రతిభను రష్మిక ‘యానిమల్’లో ప్రదర్శించిందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. హీరో పాత్రని డామినేట్ చేసేలా హీరోయిన్ పాత్రని దర్శకుడు డిజైన్ చేశాడట.

నిజమేనా.? నమ్మొచ్చా.? నమ్మాల్సిందేనేమో.!