ఇస్మార్ట్ బ్యూటీ ఎందుకు ఇన్ని అవస్థలు పడుతోంది.. పట్టించుకునే వాళ్ళే లేరా ..?

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి అందం, అభినయం ఉన్నా కూడా ఎందుకనో అవకాశాలు రావు. భారీ హిట్ అకౌంట్ లో ఉన్నా కూడా అదుగో.. ఇదుగో అన్న మాటాలే తప్ప భారీ ప్రాజెక్ట్ దక్కించుకోవడంలో విఫలమవుతుంటారు. అప్పటికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆశలు మాత్రం నెరవేరవు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే నిధీ అగర్వాల్ ఉందని అంటున్నారు. మొదటి రెండు సినిమాలు అక్కినేని హీరోలతో చేసింది. కాని హిట్ దక్కలేదు. నాగ చైతన్య తో నటించిన సవ్యసాచి.. అఖిల్ తో నటించిన మిస్టర్ మజ్ఞు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి.

Nidhhi Agerwal sizzles in iSmart Shankar - Flipboard

కాని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధికి మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ తోనూ విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఇక ఈ ఇస్మార్ట్ బ్యూటీకి టాలీవుడ్ లో తిరుగులేదని అందరూ భావించారు. కాని సీన్ చూస్తే రివర్స్ లో ఉంది. గట్టిగా ఒక్క స్టార్ హీరో సినిమా కూడా చేతిలో లేదు. గుడ్డిలోమెల్ల అన్నట్టుగా గల్లా అశోక్ డెబ్యూ సినిమాలో అవకాశం వస్తే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి నిధి కి భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.

కాని అసలు ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఏమీ రావడం లేదు. మాస్ మహారాజా రవితేజ సినిమాలో అవకాశం అందుకుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కాని రవితేజ సినిమాలో అఫీషియల్ గా మాత్రం నిధి పేరు ఎక్కడా వినిపించలేదు. మరి ఎందుకు నిధి టాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడం లో సక్సస్ కాలేకపోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పాపం చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మేకర్స్ ని ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నిధి ఒక తమిళ సినిమా నటించింది.