రష్మికను కన్సిడర్ చేయట్లేదేంటో.!

రష్మిక మండన్నా ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ కూడా దంచి కొట్టేస్తోంది. బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ‘పుష్ప 2’లో చేస్తోంది. అలాగే, ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలోనూ రష్మిక నటిస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ సినిమా నుంచి పూజా హెగ్ధే తప్పుకుంది.

పూజా హెగ్ధే తర్వాత ఆ ప్లేస్‌లోకి ఇమ్మీడియట్‌గా స్టార్ హీరోయిన్ రష్మిక వచ్చి చేరాలి. కానీ, అలా జరగలేదు. ఆ ప్లేస్‌లో కొత్త భామలు సంయుక్త, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయ్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని రష్మిక మండన్నా డైరెక్ట్‌గానే అడిగేసింది కూడా ఛాన్స్ ఇవ్వమని. అయినా, గురూజీ రష్మికను ఎందుకు కన్సిడర్ చేయలేదట. కారణమేంటని ఆరా తీస్తే, రష్మిక డేట్స్ అడ్జస్ట్ కాలేదనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.

అయితే, గురూజీ అప్రోచ్ అయితే రష్మిక కాదంటుందా.? కాస్త గట్టిగా అప్రోచ్ అయితే, రష్మిక రెడీగానే వుందంటూ రష్మిక సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం. ఏమో.! గురూజీ కాస్త గట్టిగా దృష్టి పెడితే, రష్మిక రెండోస్సారి మహేష్‌తో సూపర్ ఛాన్స్ కొట్టేసినట్లే.