‘ఖుషి’ సినిమా రిలీజ్ ముందర సమంత మీద ఒక షాకింగ్ రూమర్ బయటికి తీసుకొచ్చారు కొందరు. రెమ్యునరేషన్ విషయంలో సమంత మేనేజర్ నిర్మాతని బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారన్నది ఆ గాసిప్ సారాంశం.
నిర్మాతలు అంత తెలివి తక్కువగా వుంటారా.? ఇది పూర్తిగా సమంత ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని చెప్పొచ్చేమో. ఈ మధ్య పనిగట్టుకుని మరీ సమంత ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు.
అందులో భాగంగానే ఓ పీఆర్ టీమ్ పనిగట్టుకుని ఈ దుష్ర్రచారానికి తెర లేపిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
ఈ వ్యవహారంపై అటు నిర్మాత, ఇటు సమంత, ఇంకో పక్క సమంత మేనేజర్ అందరూ అలర్ట్ అయ్యారు. వెంటనే విషయాన్ని ఎక్కువగా పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ గాసిప్ సోషల్ మీడియా అంతటా గుప్పు గుప్పుమని పాకేసింది.
ఈ మధ్య కొన్ని పీఆర్ టీమ్స్ ఇలాంటి తప్పుడు ప్రచారాలకి తెర లేపుతున్నాయ్. అందుకే ఆ దిశగా అలాంటి వాటి విషయంలో చర్యలు తీసుకునే దిశగా పరిశ్రమ పెద్దలు సమాచాలోచనలు చేస్తున్నారట.
ఒకప్పుడు పీఆర్ టీమ్ అంటే రిలేషన్లను గట్టిగా మరింత గట్టిగా బలపరిచేలా వుండేవి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ గేర్ వేసింది. పీఆర్ అంటే రిలేషన్‌ఫిప్ పెంచేలా వుండాలి అన్నమాటకు చెల్లు చీటీ పాడేసి, చెడగొట్టేలా తయారయ్యాయ్ అదేంటో.!