అనుష్క ఎక్కడ.? అనుష్క ఎక్కడ.? ఇదిగో ఇక్కడ.! సినిమా విడుదలయ్యాక అనుష్క నుంచి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం ఓ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఇలా ఎలా.? హీరోయిన్‌కి బాధ్యత లేదా.? అన్న చర్చ అంతటా జరిగింది, జరుగుతోంది.
నిజానికి, తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో అనుష్క శెట్టి చూపించే శ్రద్ధ ఎక్కువే. కానీ, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. వ్యక్తిగత సమస్యలు, ఇతరత్రా కారణాలతోనే అనుష్క, ఈ సినిమా ప్రమోషన్‌కి రాలేదనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
ఫోన్‌లో కొన్ని ఇంటర్వ్యూలు జరిగాయ్ తప్ప, అనుష్క ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించలేదు, సినిమా రిలీజ్‌కి ముందు. సినిమా విడుదలయ్యాక మాత్రం, ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేసిందంతే అనుష్క.
అసలేం జరిగింది.? అనుష్క ఎందుకు మీడియాని నేరుగా ఫేస్ చేయడంలేదు.? ఈ సస్పెన్స్‌తో కూడిన ప్రశ్న, సినిమాకి అదనపు బజ్ తెచ్చిపెట్టిందని చిత్ర యూనిట్ భావిస్తోందిట. దీన్ని ముందే ఊహించి, వ్యూహాత్మకంగా అనుష్కని పక్కన పెట్టారని అంటున్నారు.
అది నిజమేనా.? ఇంకేదన్నా సమస్య కారణంగా అనుష్క అజ్ఞాతంలో వుంటోందా.? అనుష్క గనుక బయటకు వచ్చి వుంటే, సినిమా రేంజ్ ఇంకోలా వుండేదేమో.!