కంగనా రనౌత్ హైద్రాబాద్‌కొచ్చింది. తన సినిమా ‘చంద్రముఖి-2’ ప్రమోషన్ కోసం తెలుగునాట సందడి చేస్తోంది కంగనా రనౌత్.
తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ‘ఏక్ నిరంజన్’. ప్రభాస్ హీరో, పూరి జగన్నాథ్ దర్శకుడు. ‘పోకిరి’ సినిమాలోనే కంగన నటించాల్సి వుందట. నిజమేనా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
మహేష్ సరసన నటించాలని వుందనీ, రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని వుందనీ.. పలు ఇంటర్వ్యూల్లో కంగనా రనౌత్ చెబుతూ వస్తుండడం విన్నాం. కంగనా రనౌత్‌ని ఇంత కూల్‌గా చూడటం చాలామందికి ఒకింత ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది.
కంగనా అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అంతే కాదు, డైనమిక్.! అంతేనా, ఆమె ఫైర్ బ్రాండ్.! కంగనా రనౌత్‌ని ఏదన్నా ప్రశ్నించాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని తెలుగు మీడియా జనాలు ఫిక్సయ్యారు.
కానీ, కంగనా కూల్ అండ్ లవ్లీగా కనిపించడంతో కొందరు జర్నలిస్టులు అతి చేశారు కూడా. కానీ, కంగన లైట్ తీసుకుంది. అదే, బాలీవుడ్‌లో కనిపించే పైర్ బ్రాండ్ కంగన అయి వుంటే, బోల్డన్ని వివాదాస్పద కామెంట్లను చూసి వుండేవాళ్ళం. ఇంతకీ, కంగనలో ఈ మార్పుకి కారణమేంటి.? ఆమెని అలా ట్యూన్ చేసి తీసుకొచ్చాడట లారెన్స్. నమ్మొచ్చా.?