అనుష్క నిశ్శబ్ధం గా ఉంది ఎందుకో ఇప్పుడర్థమైందా ..!

అందరూ హాట్ హాట్ గా మాట్లాడుకుంటూ.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అనుష్క నిశ్శబ్ధం సినిమా ఎట్టకేలకి ఓటీటీలో రిలిజై పోయింది. భాగమతి సినిమా తర్వాత అనుష్క నుంచి మళ్ళీ సినిమా రాకపోవడం అది కూడా తను మూగ, చెవిటి పాత్రలో నటిస్తుందనగానే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి అనుష్క బ్రాండ్ అన్న పేరుంది. అందుకే ఈ సినిమా మీద అంతగా ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. వాస్తవంగా ఈ సినిమాని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశ్యం ముందు లేదు. అనుష్క కి ఉన్న క్రేజ్, తనకున్న మార్కెట్ సత్తానే ఇందుకు కారణం.

Nishabdham Movie Review & Twitter Reactions: Anushka Shetty, R. Madhavan's  film earns big thumbs up from fans | Regional-cinema News – India TV

అరుంధతి సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో అనుష్క సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. కాని కరోనా మూలంగా థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియక, ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అందరినీ బాగా డిసపాయింట్ చేసిందట. ఓటీటీ కావడంతో అనుష్క నటించిన సినిమా అన్న ఆతృతతో అర్థరాత్రే అందరూ సినిమా చూసేశారు.

కాని ప్రేక్షకుల అనచనాలకి తగ్గట్టు నిశ్శబ్ధం లేదని మాట్లాడుకుంటున్నారు. ఇదే థియోటర్స్ లో రిలీజ్ అయి ఉంటే జనాల పరిస్థితి.. సినిమా చూసి థియోటర్స్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. అనుష్క కూడా ఈ సినిమా మీద బాగానే అంచనాలు పెట్టుకుందని చెప్పుకున్నారు. కాని సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నప్పటికి నిశ్శబ్ధం గా ఉందంటేనే కొందరు ఒక అంచనాకి వచ్చేశారు సినిమా ఎలా ఉండబోతుందో.

ఏదేమైనా నిశ్శబ్ధం రిజల్ట్ ఇప్పుడు అనుష్క ని డైలమాలో పడేసిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తను కొత్తగా ఎలాంటి ప్రాజెక్ట్ కమిటవ్వాలన్న చాలా ఆలోచించాలి. పొరపాటున సినిమా కమిటయితే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ దెబ్బకి తట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అనుష్క కొత్తగా ఒప్పుకునే ఏ ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి మళ్ళీ తను సక్సస్ ట్రాక్ ఎక్కేదిగా ఉండాలి. కొందరేమో అనుష్క ఈ సినిమా తర్వాత పెళ్ళి చేసుకొని ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పబోతుందని ప్రచారం చేస్తున్నారు. మరి వాస్తవం ఏంటన్నది అనుష్క క్లారిటీ ఇవాలి.