ఇంత డైలమా ఎందుకు అనుమపమా క్లారిటి ఇచ్చేయ్ ..!

Anupama Paramaeshwaran

పద్ధతైన అమ్మాయిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అనుపమ ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ – సమంత నటించిన అ..ఆ సినిమాలో సెకండ్ లీడ్ చేసింది. ఆ తర్వాత ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలు చేసినప్పటికీ వీటిలో ‘శతమానం భవతి’ ఒక్కటే సూపర్ హిట్ కాగా మిగతావన్నియావరేజ్ గా నిలిచాయి. దాంతో అనుపమ రేస్ లో వెనకబడిపోయింది.

Happy Birthday Anupama Parameswaran: 5 best movies of the actress that will  leave you feeling squeezed | The Times of India

అయితే అనూహ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘రాక్షసుడు’ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కాని అనుపమ కి మాత్రం మళ్ళీ అవకాశాలు రాలేదు. ముఖ్యంగా అనుపమ కి గ్లామరస్ రోల్స్ లో నటించే ఛాన్స్ దక్కలేదు. ఒకవేళ దక్కినా తను వెనకడుగు వేసింది. దాంతో తనకంటే తర్వాత వచ్చిన రష్మిక లాంటి హీరోయిన్స్ స్టార్స్ పక్కన అవకాశాలు అందుకుంటున్నప్పటికి అనుపమ కి మాత్రం అంత గొప్ప అవకాశాలు రావడం లేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం అనుపమకి రెండు సినిమాలలో అవకాశం వచ్చిందని అంటున్నారు. ‘అర్జున్ సురవరం’ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నిఖిల్ వరసగా మూడు సినిమాలలో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి ఇంతక ముందు వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘కార్తికేయ 2’ కాగా ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ సినిమాని బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ రెండు సినిమాలలో నిఖిల్ కి జంటగా అనుపమ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. నిజంగా ఈ రెండు సినిమాలలో ఛాన్స్ వచ్చి హిట్ అయితే మాత్రం అనుపమ మళ్ళీ టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిలయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలలో నటిస్తున్నట్టు అధికారక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి. లేదా అనుపమ అయినా క్లారిటి ఇస్తే తెలుస్తుంది. ఇక అనుపమ కూడా కాస్త గ్లామర్ రోల్స్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి అనుపమ ఫ్యాన్స్ అంటున్నట్టు పంథా మార్చుతుందా లేదా చూడాలి.