ఎవరిని తీసుకుంటారో? జూనియర్ ఎన్టీఆర్ నా? లేక రమ్యకృష్ణనా?

Who will be the next host of bigg boss 4, junior ntr or ramyakrishna

మీకో విషయం తెలుసా? మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గురించి. అండ్.. మీకో షాకింగ్ న్యూస్. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో హోస్ట్ నాగార్జున పార్టిసిపేట్ చేయడం లేదు. ఆయన ప్రస్తుతం ఇండియాలోనే లేరు. ఆయన ఫారిన్ వెళ్లారు. తన సినిమా షూటింగ్ కోసం 20 రోజుల పాటు ఫారిన్ లోనే ఉండనున్నారు. దీంతో రెండు వారాల వీకెండ్ ఎపిసోడ్స్ ను ఎవరితో చేయించాలా? అని బిగ్ బాస్ నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు.

Who will be the next host of bigg boss 4, junior ntr or ramyakrishna

ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ ను కాకుండా వేరే వాళ్లను ఊహించుకోలేం. మూడో సీజన్ సక్సెస్ అయింది అంటే అందులో నాగ్ పాత్ర ఎనలేనిది. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా అంతే క్రేజ్ తో ముందుకు తీసుకెళ్తున్నారు నాగ్.

అయితే.. తప్పని పరిస్థితుల్లో ఆయన షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన ఫారిన్ వెళ్లారు. అందువల్ల వీకెండ్స్ ఎపిసోడ్స్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించారట. అంతకు ముందే నానిని సంప్రదిస్తే.. నాని రావడం కష్టం అని చెప్పారని తెలుస్తోంది.

Who will be the next host of bigg boss 4, junior ntr or ramyakrishna

అందుకే.. జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించగా.. మరో రెండు నెలలు ఫుల్లుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉందని.. క్యాల్షీట్లు లేవని జూనియర్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ.. దాంట్లో నిజమెంతో మాత్రం తెలియడం లేదు.

అయితే.. బిగ్ బాస్ నిర్వాహకులకు ఇక మిగిలిన ఒకే ఒక చాన్స్ రమ్యకృష్ణ. అవును.. బిగ్ బాస్ 3 సీజన్ లోనూ నాగార్జున తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గ్యాప్ ఇచ్చినప్పుడు ఓ వీకెంట్ షోను తనే నడిపించింది. హోస్టింగ్ కొత్త అయినా కూడా రమ్యకృష్ణ షోను బాగా డీల్ చేయడంతో.. ఇక తప్పని పరిస్థితుల్లో బిగ్ బాస్ నిర్వాహకులు రమ్యకృష్ణ వైపే మొగ్గు చూపుతున్నారట. ఆమెను సంప్రదించారా? ఆమె ఓకే చెప్పిందా? అనే విషయం తెలియాలంటే మాత్రం శనివారం రాత్రి 9 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే.