ఓహో.. ప్రేక్షకులు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు భలే ట్విస్ట్ ఇచ్చారు. అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా మొట్టమొదటగా అభిజిత్ ను సేవ్ చేశారు. ఆ తర్వాత జోర్దార్ సుజాత ను సేవ్ చేసేశారు. నిజానికి హౌస్ లో మొదటి నుంచి ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరు అంటే గంగవ్వ అనే చెప్పాలి. బయట కూడా గంగవ్వకు సెపరేట్ ఆర్మీ ఏర్పడింది. గంగవ్వ గెలుపు కోసం బాగా కృషి చేస్తున్నారు. కానీ.. ప్రేక్షకులు మాత్రం తమ తీర్పును చెప్పేశారు. ముందుగా అభిజిత్ ను సేవ్ చేసి. ఆ తర్వాత సుజాత.. మూడో ప్లేస్ లో గంగవ్వ ఉన్నారు.
శనివారం రోజున హోస్ట్ నాగార్జున ముగ్గురు సభ్యులను సేవ్ చేశారు. అభిజిత్, సుజాత, గంగవ్వ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా.. ఇక మిగిలింది మరో నలుగురు కంటెస్టెంట్లు.. సూర్య కిరణ్, దివి, మెహబూబ్, అఖిల్. ఈ నలుగురిలో ఒకరు ఆదివారం షో నుంచి బయటికి వెళ్లబోతున్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరు ఆ ఒకరు.. అనేదే ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
దివి గురించి మాట్లాడితే.. ప్రస్తుతం తను హౌస్ లో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే ఉంది. ముందు రెండు మూడు రోజులు ఏం మాట్లాడకపోయినా.. తర్వాత తను మాట్లాడటం మొదలు పెట్టింది. ప్రస్తుతం తన ఆట తాను బాగానే ఆడుతోంది. కాబట్టి తనను ప్రేక్షకులు ఇంత త్వరగా ఇంటికి పంపించే అవకాశం లేదని తెలుస్తోంది.
అఖిల్ కూడా ముందు నుంచి కాస్త మంచిగానే హౌస్ లో మెదులుతున్నాడు. అందరితో బాగుంటున్నాడు. పెద్దగా గొడవల జోలికి వెళ్లడం లేదు కాబట్టి.. ప్రేక్షకులు అఖిల్ కూడా సేవ్ చేస్తారని తెలుస్తోంది.
ఇక పోతే సూర్య కిరణ్, మెహబూబ్.. ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఆదివారం ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
మెహబూబ్ లో పెద్దగా నెగెటివ్ ఏమీ లేనప్పటికీ.. హౌస్ లో వచ్చినప్పటి నుంచి పెద్దగా ఆయన ఎంటర్ టైన్ చేసిందేమీ లేదు. అందుకే ప్రేక్షకులు మెహబూబ్ ను ఇంటికి పంపిద్దామనుకుంటున్నారా? అనేది కొంచెం డౌట్ గానే ఉంది.
సూర్య కిరణ్ గురించి చెప్పాలంటే.. ఆయన కొంచెం అందరితోనూ కాస్త ఘాటుగానే మాట్లాడుతున్నాడు. డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందులోనూ ప్రతి విషయంలో తలదూర్చుతున్నారు. ప్రేక్షకులకు ఆయన బిహేవియర్ కొంచెం చిరాకుగానే అనిపిస్తోంది. దీంతో సూర్య కిరణ్ ను హౌస్ నుంచి పంపించేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.