సూరి వర్సెస్ అఖిల్.! ‘ఏజెంట్’ పోస్టుమార్టమ్.!

‘ఏజెంట్’ సినిమా ఎందుకు తన్నేసింది.? ఈ అంశం చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోందిట. ‘సూరిని నమ్మాను.. నట్టేట్లో ముంచాడు..’ అని అఖిల్ అక్కినేని అంటున్నాడనీ, అదే సమయంలో తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అఖిల్ కెలికేసినట్లు సురేందర్ రెడ్డి చెబుతున్నాడనీ ఒకటే గుసగుస.! సరిపోయింది.!

ఈ ఇద్దరూ ఒకర్నొకరు కూడబలుక్కుని ‘ఏజెంట్’ సినిమాని మట్టికరిపించేశారన్నది ఇన్‌సైడ్ రిపోర్ట్. ఈ ఇద్దరి ‘అతి’ కారణంగానే నిర్మాత దారుణంగానష్టపోయే పరిస్థితి వచ్చిందట.

ఆ హీరోయిన్ ఏంటి.? ఆ మ్యూజిక్ ఏంటి.? ఇలా చర్చలు జరుగుతున్నాయట. సాంతం నష్టపోయాక ఇప్పుడు పోస్టుమార్టమ్ వల్ల ప్రయోజనమేంటి.? అఖిల్ లాంటి హీరో మీద అంత పెద్ద బడ్జెట్ పెట్టడమే తెలివితక్కువ పని.!

అఖిల్ ‘అతి’ మానేసి, కూల్ అండ్ లవ్లీ సినిమాలు.. అదీ పరిమిత బడ్జెట్‌లో చేసుకోవడం మంచిది.