శ్రీదేవి కూతురు పక్కన నటించబోయే ఛాన్స్ కొట్టేయబోతోన్న ఆ లక్కీ తెలుగు హీరో ఎవరో ?

శ్రీదేవి అతిలోక సుందరి గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. శ్రీదేవికి అన్నీ చిత్ర పరిశ్రమలలో విపరీతమైన పాపులారిటీ ఉంది. తన లాంటి నటి మరొకరు ఉండరన్న సంగతి పలు సందర్భాలలో ప్రూవ్ అయింది. అయితే శ్రీదేవి కి తన కూతురులిద్దరిని హీరోయిన్స్ గా చూడాలని కోరిక ఉండేది. తను బ్రతికి ఉన్నప్పుడు జాన్వీ కపూర్ లాంచింగ్ కోసం ఎంతో తాపత్రయపడింది. కాని కూతురులను హీరోయిన్స్ గా చూడకుండానే అనంత లోకాలకి వెళ్ళిపోయిది. అయితే తల్లికి తగ్గ తనయ అన్న పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్.

డెబ్యూ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. అందం అభినయం లో తల్లి శ్రీదేవి లాగానే జాన్వీ కపూర్ కూడా అన్న ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తోంది. గుంజన్ సక్సేనా లాంటి బయోపిక్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి గాని ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఇప్పటికే జాన్వీ కపూర్ తెలుగులో ఎన్.టి.ఆర్ సినిమాలో నటించబోతుందని.. విజయ్ దేవరకొండ కి జంటగా నటించడానికి ఒప్పుకుందని.. పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ గానే మిగిలాయి.

అయితే రానున్న సమ్మర్ లో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉండబోతోందని అంటున్నారు. వాస్తవంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్లో నటిస్తుందని భావించారు. కానీ సాధ్యపడలేదు. పూరి – దేవరకొండ లైగర్ లో నటిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. కాగా జాన్వీ ఒక తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లేటెస్ట్ అప్‌డేట్. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ జాన్వీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. చేసే ప్రతీ సినిమా ఎంతో పక్కాగా చేస్తాడు. ప్రస్తుతానికి ఇవే ఈ డైరెక్టర్ కి సంబంధించిన హింట్స్. త్వరలో ఆ డైరెక్టర్ .. ప్రాజెక్ట్ ఏంటన్నది వెల్లడి కానుందని సమాచారం. జాన్వీ తండ్రి బోనీకపూర్ వకీల్ సాబ్ ని దిల్ రాజు తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.