బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకులు ఈ కట్టప్ప ఎవర్రా బాబు.. అని నెత్తి గోక్కుంటున్నారు. మొదటి ఎపిసోడ్ లోనే బిగ్ బాస్ ఈ హౌస్ లో కట్టప్ప ఉన్నాడు. ముందునుంచి మంచిగానే మాట్లాడుతూ… వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నాడు. కట్టప్పతో జాగ్రత్తగా ఉండండి.. అంటూ కంటెస్టెంట్లను రోజూ హెచ్చరిస్తూనే ఉన్నాడు బిగ్ బాస్.
తర్వాత.. మీరు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారు.. పేరు రాసి బ్యాలెట్ లో వేయాలంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. సరేలే.. ఇలాగైనా కట్టప్ప ఎవరో తెలుస్తుంది అని కంటెస్టెంట్లు అనుకున్నారు.. ప్రేక్షకులు కూడా అనుకున్నారు. తీరా ఏమైంది.. దాని రిజల్ట్ ఏం చెప్పలేదు.
తర్వాత సొహైల్, ఆరియానాలకు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ మెట్స్ ను ఒక్కొక్కరిని పిలిచి.. మీకు కట్టప్ప ఎవరు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది.. అంటూ కారణాలు చెప్పాలంటూ మరో టాస్క్ ఇచ్చాడు. అందులో కొందరు చెప్పారు.. కొందరు చెప్పలేదు.. పోనీ.. అప్పటికైనా కట్టప్ప ఎవరో బిగ్ బాస్ చెప్పాడా? అంటే చెప్పలేదు. మళ్లీ సస్పెన్స్.
సరేలే… ఇంకో ఎపిసోడ్ లో కటప్ప ఎవరో రివీల్ చేస్తారు కాబోలు అని అందరూ అనుకున్నారు. కానీ.. లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా మీరు కట్టప్ప అని ఎవరిని భావిస్తున్నారో.. కారణం చెప్పి.. ఆవ్యక్తి ముఖం మీద కట్టప్ప ముద్రను వేయాలంటూ బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ చెప్పినట్టుగానే ఆ టాస్క్ ను కూడా ఫినిష్ చేస్తారు.
తీరా.. అంతా అయిపోయాక.. ఈ హౌస్ లో ఉన్న కట్టప్ప ఎవరో బిగ్ బాస్ చెప్పడు. మీరే తెలుసుకోవాలి.. అటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లు కాస్త అసహనానికి గురయ్యారు. ప్రేక్షకులు అయితే బిగ్ బాస్ పై ఫైర్ అయ్యారు.
అసలు కట్టప్ప ఎవరో చెప్పకుండా ఈ ట్విస్టులు ఏంటో? ఇదేం బిగ్ బాసో? అంటూ ప్రేక్షకులు తమలో తామే బాధపడుతున్నారు. ఒక్క కట్టప్ప మ్యాటర్ తోనే షో మొత్తాన్ని నడిపిస్తారా? ఏంటి అని నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.