చెలరేగిపోతున్న స్టార్ హీరోయిన్స్ మధ్య చిచ్చు పెట్టిందెవరు ..?

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతూ ఫుల్ ఫాం లో ఉన్నారు పూజా హెగ్డే.. రష్మికా మందన్నా. ఈ ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ ఉంది. అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా దాదాపు ఇద్దరిదీ ఒకే రేంజ్ అంటున్నారు. ఈ ఇద్దరి టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటేనే ఒకరు బాలీవుడ్ లో ఒకరు కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు.

Radhe Shyam Movie Trailer: New 'Radhe Shyam' Trailer Promises an Epic Love  Story

లక్కీ హీరోయిన్స్ గా పాపులారిటీని సంపాదించుకున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న ల కోసం బడా నిర్మాణ సంస్థలు డేట్స్ పట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్.. కాజల్ అగర్వాల్.. తమన్నా లాంటి హీరోయిన్ లకు ఇదే క్రేజ్ ఉండేది. కాగా ప్రస్తుతం వీళ్ళ హవా తగ్గడంతో యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరూ .. పూజా హెగ్డే లేదా రష్మిక లనే తమ సినిమాలలో కావాలని పట్టుబడ్తున్నారట.

Team of Pushpa to resume shooting in a dense forest in Nalgonda? | Telugu  Movie News - Times of India

ఇప్పటికే కన్నడ బ్యూటీ రష్మిక మందన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప తో పాటు శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. తెలుగు తమిళం, కన్నడ ఇండస్ట్రీస్ నుంచి రష్మిక కి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్య నటించబోతున్న నెక్స్ట్ సినిమాలో రష్మికను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది,

ఇప్పటికే కార్తీ నటిస్తున్న ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పూజా హెగ్డే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘రాధే శ్యామ్’ తో పాటు అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోనూ చేస్తోంది. అంతేకాదు పూజా హెగ్డే బాలీవుడ్ లో 3 భారీ సినిమాలలో నటిస్తోంది. దాంతో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మా హీరోయిన్ నంబర్ వన్ అంటే మా హీరోయిన్ నంబర్ వన్ అని చెప్పుకుంటున్నారట. వాస్తవంగా ఈ నంబర్ వన్ ప్లేస్ గురించి ఆలోచించే తీరిక పూజా హెగ్డే – రష్మిక మందన్న లకి లేకపోయిన ఫ్యాన్స్ కావాలని చిచ్చు పెడుతున్నారని టాక్.