పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చినట్లే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగులోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ మూవీపై హై బజ్ ఉంది. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అయితే పుష్ప 2 నుంచి వచ్చే అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ పుట్టున రోజు సందర్భంగా పుష్ప ది రూల్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఇక ఈ టీజర్ లోకి వెళ్తే తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అనే న్యూస్ యాంకర్ వాయిస్ తో వీడియో స్టార్ట్ అయ్యింది. పుష్పని పట్టుకునే క్రమంలో పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడని ప్రెజెంట్ చేశారు. శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కూసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు. పోలీసుల కాల్పులలో పుష్ప మరణించాడు అని వదంతులు వ్యాపించడంతో చిత్తూరు, తిరుపతి ప్రాంతాలలో అల్లర్లు చెలరేగాయి. దివి వాద్యా రిపోర్టింగ్ వాయిస్ తో చెబుతూ ఉండగానే ఆస్తులు ద్వంసం చేయడం విజువల్స్ లో ఎలివేట్ చేశారు.

ఇక పుష్ప కోసం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు. పోలీసులకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెబుతున్నారు కాని… సంపాదించిన దుడ్డు ఏం చేస్తున్నారో చెబుతున్నారా అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్ తో పుష్పరాజ్ చేసే సమాజసేవని ఎస్టాబ్లిష్ చేశారు. పుష్ప జపాన్, మలేసియా, చైనాలో ఉండే అవకాశం ఉందనే విధంగా విజువల్స్ ని యాంకర్ వాయిస్ తో ప్రెజెంట్ చేశారు.

ఇక ఒక వ్యక్తి సిటీ కేబుల్ ఆఫీస్ కి వచ్చి క్యాసెట్ ఇవ్వడం అందులో శేషాచలం ఫారెస్ట్ ని పులులని గుర్తించడం కోసం పెట్టిన కెమెరాలలో పులి రెండు అడుగులు వెనక్కి వేయడం అదే సమయంలో పుష్ప దాని ముందు నడుచుకుంటూ వెళ్ళడం ఎలివేట్ చేశారు. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం. అదే పులే రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చినాడని అర్ధం అని డైలాగ్ చెప్పడం పుష్ప లుక్ ని ఎలివేట్ చేయడంతో టీజర్ ఎండ్ అయ్యింది.

మొదటి భాగంలో పుష్ప ని కంప్లీట్ గా నెగిటివ్ యాంగిల్ లో రిప్రజెంట్ చేసిన సుకుమార్ ఈ సినిమాలోని పుష్పలో ఉన్న పాజిటివ్ సైడ్ ని చూపించినట్లు టీజర్ బట్టి అర్ధం అవుతుంది. అలాగే పుష్ప ఎందుకు స్మగ్లింగ్ డాన్ గా మారాల్సి వచ్చింది అనేది కూడా ఈ కథలో చెప్పబోతున్నట్లు టీజర్ బట్టి స్పష్టంగా తెలుస్తుంది. టీజర్ మొత్తం పుష్ప చుట్టూ జరిగిన ఘటనలు, వాటి నుంచి పుష్పరాజ్ బ్రతికే ఉన్నాడని చూపించి ఏదో ఇంటరెస్టింగ్ గా కథని చెప్పబోతున్నట్లుగా సుకుమార్ హిట్ ఇచ్చారు. ఇక టీజర్ కి దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందించడం విశేషం.

Where is Pushpa? | Pushpa 2 - The Rule 🔥 | Telugu | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh Faasil