Ram Charan: మెగా స్టార్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే రాజమౌళి తీసిన మగధీర తో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతటి విజయం తర్వాత తీసిన లవ్ ఫీల్ గుడ్ మూవీ ఆరంజ్ మాత్రం నిరాశను మిగిల్చింది.
ఆరంజ్ సినిమాలోని పాటలు ఇప్పటికీ యువతరాన్ని అలరిస్తూనే ఉన్నాయి.అయితే సినిమా మాత్రం చాలా మంది ప్రేక్షకులకు అర్థంకాలేదు కొంత మందికి ఈ కొత్తగా చెప్పిన కథ నచ్చినా చాలా మందికి ఎక్కక పోవడంతో డిశాస్టర్ గా మిగిలింది.
ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించింది.చాలా భాగం సినిమా ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు.ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కాగా నాగబాబు నిర్మాత. సినిమా భారీగా నష్టపోవడం వల్ల నాగబాబు ఆర్ధిక నష్టాలను చూసారు.ఇక రామ్ చరణ్ ను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం మానేశారట. చాలా రోజులు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారట రామ్ చరణ్ ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించారు. ఎక్కడ తన కెరీర్ ముగిసిపోయిందనే సమయంలో చౌదరి గారు మళ్ళీ తనకు అవకాశం ఇచ్చారని ఈ విషయాన్నీ జీవితం లో మర్చిపోలేనని చెప్పారు.
అయితే వైఫల్యాలే విజయానికి పునాది అన్నట్టు ఆ పరాజయం తర్వాత రామ్ చరణ్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రంగస్థలం వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రాల్లో మెప్పించారు.
రామ్ చరణ్ RRR మూవీ ప్రొమోషన్స్ లో ప్రస్తుతం బిజీ గా ఉన్నారు. దీని తర్వాత ఆచార్య సినిమా తన తండ్రి తో కలిసి చేస్తున్నారు. దీని తర్వాత మరో ఐదు ప్రాజెక్టలను లైన్ లో పెట్టినట్టు సమాచారం.